

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 29
వ్యవహారిక భాష్యోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి
పోతు గుంట రమేష్ నాయుడు
రాజంపేటలోని బిజెపి కార్యాలయంలో తెలుగు భాషకు ఎంతగానో కృషి చేసిన వీడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ.
"పంచదార కన్న - పనస తొనల కన్న
కమ్మని తేనె కన్న - తెలుగు మిన్న"
తెలుగు భాష అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన గిడుగువెంకటరామమూర్తి గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు .తెలుగు ప్రజలందరికీ, తెలుగు మాట్లాడే వారందరికీ తెలుగుభాషాదినోత్సవం శుభాకాంక్షలు .పండిత పురుషులకే గ్రాంథిక రూపంలో పరిమితమైన తెలుగు భాష కమ్మదనాన్ని వాడుకబాషలోకి తీసుకురావడానికి వ్యవహారిక బాషా ఉద్యమాన్ని తన జీవిత చరమాంకం వరకు నడిపి తెలుగుభాష మధుర ఫలాల్ని క్షేత్రస్థాయికి చేర్చిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ వ్యవహారికభాషోద్యమ
పితామహుడు
గిడుగువెంకటరామమూర్తి గారు అని అన్నారు తెలుగు ప్రజలుగా మనందరం సాధ్యమైనంత వరకు తెలుగు భాషనే మాట్లాడదాం ఆచరిద్దాం భావితరాలకు తెలుగు భాషను అందిద్దాం అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ ప్రధాన కార్యదర్శి పెనుగొండ రమణ రైల్వే కోడూరు అసెంబ్లీ కో కన్వీనర్ గాదెల శ్రీనివాసులు బిజెపి మండల కార్యదర్శి పెనిగలపాటి సుబ్రహ్మణ్యం నాయుడు బిజెపి పార్లమెంట్ నాయకులు తోట నగేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎన్ గిరీష్ తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird