Home ఆంధ్రప్రదేశ్ టిడిపి నేత, కుప్పాలకు ధన్యవాదాలు తెలిపిన ఎస్సీ కాలనీవాసులు

టిడిపి నేత, కుప్పాలకు ధన్యవాదాలు తెలిపిన ఎస్సీ కాలనీవాసులు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 29

సిద్ధవటం మండలంలోని నే క నా పురం గ్రామం ఎస్సీ కాలనీ నివాసులకు వినాయక చవితి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు గంగాధర్ గురువారం మాట్లాడుతూ వినాయక చవితి వేడుకల్లో భాగంగా 22వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య వినాయకుని విగ్రహం మరియు అన్నప్రసాదాలకు సహకరించి మాకు అన్ని విధాలుగా తోడ్పడుతున్నాడని తెలిపారు ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వినాయక నిమజ్జనం శనివారం నిర్వహిస్తామని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు, మండల ఎస్సై మహమ్మద్ రఫీ సూచనల మేరకు ఎలాంటి సమస్యలు లేకుండా నిమజ్జనం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు

2,842 Views

You may also like

Leave a Comment