Home ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

by VRM Media
0 comments

ఒంటిమిట్టలో అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపిన ఒంటిమిట్ట సర్పంచ్. సుజాత
పంచాయతీ కార్యదర్శి సుధాకర్

VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి రవిబాబు ఆగస్టు 30

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి పశువుల మంద లో పంచాయతీకి సంబంధించి గ్రామ కంటాన్ని ఆక్రమించి రేకుల షెడ్లు వేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారాలు సాగిస్తున్నారు . ఈ రేకుల షెడ్లు రోజురోజుకు అధికం కావడంతో ఈ విషయం కలెక్టర్ దృష్టికి పోవడంతో కలెక్టర్ ఆదేశాలు మేరకు గ్రామ కంటాన్ని ఖాళీ చేయమని ఆర్డర్స్ రావడంతో ఒంటిమిట్ట సర్పంచ్ సుజాత మరియు ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఈ గ్రామ కంఠంలో అక్రమ కట్టడాలను తొలగించమని కడప జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఆయన ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సర్పంచ్ కే.సు జాత పంచాయతీ కార్యదర్శి సుధాకర్లు అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపారు. శుక్రవారం ఆగస్టు 30 తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ ఘటనపై ఒంటిమిట్ట ప్రజలు స్పందించి సర్పంచుకు పంచాయతీ కార్యదర్శి కి సపోర్టుగా నిలిచారు ఒంటిమిట్ట విఆర్ఓ అంజి మరియు పోలీస్ సిబ్బంది వీరికి సహాయ సహకారాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట విఆర్ఓ అంజి. ఒంటిమిట్ట సర్పంచ్ కే సుజాత పంచాయతీ కార్యదర్శి సుధాకర్ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

2,829 Views

You may also like

Leave a Comment