Home ఆంధ్రప్రదేశ్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో టక్కోలు ఎస్సీ, బీసీ కాలనీల్లో “సూపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం ఘనంగా

రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో టక్కోలు ఎస్సీ, బీసీ కాలనీల్లో “సూపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం ఘనంగా

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ ఆగస్టు 01

సిద్ధవటం మండలం, టక్కోలు గ్రామం:
టక్కోలు గ్రామ పంచాయతీలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో “సూపరిపాలన తొలి అడుగు” డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం ప్రజల విశేష ఆదరణతో విజయవంతంగా నిర్వహించబడింది. కూటమి ప్రభుత్వ పర్యవేక్షణలో సాగిన ఈ ప్రచారంలో కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి, గత సంవత్సరం కాలంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల జీవనోన్నతిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రణాళికల గురించి వివరించడమేగాక, ఆగష్టు 15 నుండి మహిళల కోసం ప్రారంభించబోయే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా విశదీకరించారు.
ఈ కార్యక్రమం ద్వారా స్థానికుల ప్రాథమిక సమస్యలు, అవసరాలను గుర్తించి నమోదు చేయడం జరిగింది.
కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి, శంకర్, శ్రీను, సుబ్బారాయుడు తదితర నాయకులు పాల్గొని, పార్టీ విధానాలను ప్రజలకు వివరిస్తూ ఉత్సాహం కలిగించారు.

2,898 Views

You may also like

Leave a Comment