


రంపచోడవరం నియోజకవర్గం
దేవిపట్నం ప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్
దేవీపట్నం మండలం శరభవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్.రామన్నపాలెం గ్రామంలో రెండు ఇళ్ళు దగ్ధం ఎస్.రామన్న పాలెం గ్రామంలోని కుక్క అప్పాయమ్మ భర్త భీముడు తాటాకు ఇల్లు మొత్తం దగ్ధమైందన్నారు.మరియు కుక్క వెంకట్రావు తండ్రి అర్జుడు పూరి ఇల్లు పాక్షికంగా దగ్ధమైందన్నారు.గ్యాస్ లీకవ్వటం ప్రధాన కారణం మంటలు చలరేగడం గ్రామస్థులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా బండ పేలటంతో రెండు ఇళ్ళు దగ్నమైనవి అని గ్రామస్థులు
తెలియచేజేశారు.కోరుకొండ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు కానీ ఒక్క ఇల్లు పూర్తి స్థాయిలో దగ్నమైపోయింది పూర్తి నష్టం వాటిల్లింది అని రెండొవ ఇల్లు కొన్ని మేరకు సామాగ్రి మిగిలిందని భాదితులు తెలియచేసారు. జనసేనపార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు మాట్లాడుతూ గ్యాస్ కంపెనీకి సంబందించి నటువంటి ఇన్సూరెన్స్ క్లయిమ్ చెయ్యాలని దానికి సంబంధిత యాజమాన్యా దృష్టి కి తీసుకెళ్తామని అలానే అగ్నిమాపాక సిబ్బంది సిబ్బంది ద్వారా లెటర్ ఇస్తారని దాని ద్వారా నష్టాన్ని చెల్లించాలని పక్క ఇళ్లను అందించాలని గౌరవ ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి దృష్టి అలానే సదరు అధికారులు, అధికారకంగా జనసేనపార్టీ లెటర్ ప్యాడ్ ద్వారా ఇస్తామని తక్షణమే పూర్తిగా ఇల్లు దగ్ధమైన వారి కుటుంబానికి మరియు పాక్షికంగా ఇల్లు దగ్ధమైన వారి కుటుంబానికి ఈ రెండు కుటుంబలను ప్రభుత్వం నుండి రావలసిన అన్ని సౌకర్యాలతో ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తామని బాధితులకు తెలియచేసారు.
బాధితులకు 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు కొంత నగదు అందిచటం జరిగింది కచ్చితంగా జనసేనపార్టీ తోడుగా ఉంటుందని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కర్రీ మహేష్,ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు, రెండొవ ఉపాధ్యక్షుడు తురసం రాజకుమార్,సీనియర్ నాయకులు ఐనవిల్లి భద్రం, కొత్తపల్లి సతీష్,తుర్రం ధర్మరాజు,తాటి రాజేష్, మనుపాటి అంజిబాబు,పి.న్ మూర్తి,మట్ట సందీప్, నేసిక రమేష్, కొమరం నాగన్న దొర,కొమరం జగ్గారావు,జొన్నల అనీల్ కుమార్, సోదే రవికుమార్, సింగరాజు,జనసేన మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird