Home ఆంధ్రప్రదేశ్ అధికారులు తీరుపై ఎమ్మెల్యే ఫైర్

అధికారులు తీరుపై ఎమ్మెల్యే ఫైర్

by VRM Media
0 comments

విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళుతున్నది కేవలం అధికారులు పర్యవేక్షణ లోపమే

హుకుంపేట (అల్లూరి జిల్లా) న్యూస్: VRM Media

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ముఖ్య అతిథిగా అరకు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హాజరయ్యారు. ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అధికారులతో ముఖాముఖిగా మాట్లాడి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా మండల పరిధిలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకొని మండల పరిధిలో నేడు జరుగుతున్న అభివృద్ధి తీరుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు కొంతమంది అధికారులు కొన్ని కార్యక్రమాలు సంబంధిత ప్రజాప్రతినిధులకు చెప్పకుండా నిర్వహించడం ఇంకొంతమంది అధికారులు న ప్రజాప్రతినిధులను మేము ఫలానా డిపార్ట్మెంట్ అధికారులని కూడా చెప్పకపోవడం దౌర్భాగ్యం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే మీరు మండల పరిధిలో ప్రతి గ్రామంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఆయా పంచాయితీకి చెందిన ప్రజా ప్రతినిధులకు తెలియజేసి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేదు మేము తెలియజేయము మా ఇష్టానుసారం మేము మిగిలిన నిర్వహిస్తామంటే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా నేడు జరిగిన సర్వసభ్య సమావేశంలో కొంతమంది ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నేడు కొన్ని పాఠశాలలో విద్యార్థులు మత్తు పదార్థాలు సేవిస్తున్నారని దీనికి కారణం సంబందిత అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపమేనని దీనికి నిదర్శనం ఈ మధ్యకాలంలో హుకుంపేట ప్రధాన కేంద్రంలోని గంజాయితో కొంతమంది విద్యార్థులు హల్ చల్ చేయడం దీనికి నిదర్శనం అని ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం మేల్కొని విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించిvఅన్ని పాఠశాలలకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలో ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

2,894 Views

You may also like

Leave a Comment