

సిద్ధవటంVRM న్యూస్ ఆగస్టు 7 స్థానిక బ్రాహ్మణ వీధిలోని శ్రీ సాయి హైస్కూల్ నందు ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రేవతీ దేవి మాట్లాడుతూ అన్నా చెల్లెల్లు మధ్య ఆప్యాయత, అనురాగాలకు చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటామని, అలాగే సోదరుల క్షేమము కోరుతూ సోదరీమణులు రాఖీ లను చేతికి కట్టి తమ సోదరుల దీవెనలు అందుకుంటారు. సోదరుడు తన సోదరికి జీవితాంతం రక్షణగా ఉంటూ ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకుంటూ జీవింతాంతం ఒకరికొకరు తోడుగా ఉండే గొప్ప పండుగ అని పండుగ విశిష్టతను తెలియజేసి విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి అందరికి దీవెనలు అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird