

కడప ఎడ్యుకేషన్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 12:
కడప ఎడ్యుకేషన్సహాయ పరిశోధకులు, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం.జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో సంస్కృత భాషకు ప్రాధాన్యత ఇస్తూ పట్టం కడుతున్నారని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధ కులు డా.చింతకుంట శివారెడ్డి అన్నారు. కడప ప్రభుత్వ పురు షుల కళాశాల(ఆర్ట్స్ కాలేజి) సంస్కృతశాఖ అంతర్జాతీయ సంస్కృత భాషా దినోత్సవ సప్తా హం లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రధానవక్తగా విచ్చేసిన డా.చింత కుంట శివారెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో సంస్కృత భాషకు చెందిన వేదాలు, ఉపనిషత్తులపై ప్రత్యేక పరిశోధనలు చేసి అనేక వైజ్ఞానిక అంశాలు వెలుగులోకి తెస్తున్నారన్నారు. వైద్యం, వైమా నికం, అణు సంబంధ అనేక అంశా లు వేదాల్లో నిక్షిప్తమై ఉన్నాయ న్నారు. ప్రత్యేకించి సైన్సుకు చెందిన పరిజ్ఞానం సంస్కృతంలో మెండుగా ఉందన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను ఆ దిశగా పరిశోధ నలు చేయించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డా.జి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ భాషా దినోత్సవాలు నిర్వహిం చుకోవడంవల్ల విద్యార్థుల్లో సంస్కృతి సంప్రదాయాలపట్ల గౌరవం పెరుగుతుందన్నారు. సంస్కృతభాష అన్ని భాషలకు మాతృభాష అని అన్నారు. సంస్కృతశాఖ అధ్యాపకులు డా.టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్కృత భాష మనిషిని మనీషిగా మారుస్తుందన్నారు. వ్యక్తి జీవితా న్ని సంస్కరింపే శక్తి సంస్కృతానికి ఉందన్నారు. అనంతరం వక్తను నిర్వాహకులు శాలువాతో సత్క రించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజి విద్యార్థులు పాల్గొన్నారు.