Home ఆంధ్రప్రదేశ్ జడ్పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం

జడ్పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం

by VRM Media
0 comments

VRM ఒంటిమిట్ట బాల మౌలాలి ఆగస్టు 15

ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం
సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు – మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఎస్‌.వి.
ఒంటిమిట్ట మండలం జడ్పిటిసి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఎస్‌.వి. రమణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
“జగన్మోహన్ రాజు ఆద్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలలో రాష్ట్ర పార్టీ సూచనల మేరకు రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు , ఫరూక్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జోనల్ ఇంచార్జ్ దీపక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. రాజంపేట నియోజకవర్గం అబ్జర్వర్ చిట్టిబాబు, ఎమ్మెల్యేలు పుల్లారావు, మురళి, రూపానందరెడ్డి, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ అనురాధ, రవి నాయుడు, జయప్రకాష్, హరిప్రసాద్, శ్రీనివాస రాజు, సాయి లోకేష్, అతికారి కృష్ణ, రమేష్ నాయుడు అలాగే రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు అందరూ ఇక్కడ పార్టీ క్యాడర్‌తో కలిసి పనిచేయడం మాకు ఎంతో సంతోషం కలిగించింది” అని పేర్కొన్నారు.
వార్డువారీ బూత్ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, యువజన విభాగం కార్యకర్తలు, మహిళా సంఘాలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ ఐక్యంగా కృషి చేశారని నాయకులు తెలిపారు. ప్రచారంలో పాదయాత్రలు, మోటార్ బైక్ ర్యాలీలు, గ్రామసభలు, ఇంటింటి పర్యటనలు ప్రజలలో ఉత్సాహాన్ని నింపాయని వివరించారు. “ఈ ఎన్నికల ఫలితంతో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన పట్ల ప్రజల ఆకాంక్ష బలంగా వ్యక్తమైంది. భవిష్యత్తులో కూడా ఈ నమ్మకానికి తగిన విధంగా పనిచేస్తాం” అని వారు స్పష్టం చేశారు. “ప్రతి ఓటు వెనుక ఒక శ్రమ, ఒక నమ్మకం ఉంది. దానిని నిలబెట్టుకోవడం మా ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నాం” అని అన్నారు.

2,910 Views

You may also like

Leave a Comment