
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట ఆగస్టు 19
ఐ వి ఆర్ ఎస్. కార్యక్రమంలో భాగంగా ఒంటిమిట్ట మండలంలోని పెన్న పేరు గ్రామపంచాయతీ లో పారిశుద్ధ్య పనులలో చాలా వెనుకబడి ఉన్నది సదరు గ్రామాన్ని సందర్శించి శానిటేషన్ పనులను పరిశీలించిన జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి .ఈ కార్యక్రమంలో పెన్న పేరూరు గ్రామంలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని లేదంటే జబ్బుల బారిన పడతారని ఇంటింటికి తిరిగి ప్రజలకు శుభ్రత పరిశుభ్రత గురించి శానిటేషన్ వలన జరిగే లాభాల గురించి ప్రజలకు వివరించారు ఎక్కువగా మురికి నీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మురికి నీరు లేకుండా శుభ్రపరుచుకోవాలని లేదంటే డెంగు మలేరియా విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజ్యలక్ష్మి ప్రజలను ఉద్దేశించి అన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి జబ్బులకైనా దూరంగా ఉండవచ్చని అన్నారు. ప్రతి గ్రామానికి మంగళవారం శుక్రవారం నాడు పంచాయతీ ట్రాక్టర్ చెత్త వేసుకొని పోయేటందుకు వస్తుందని ప్రతి ఒక్కరూ చెత్తను ట్రాక్టర్కు వేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి. ఈవోపీఆర్ డి . కేఎంఆర్ ప్రసాద్. పాల్గొన్నారు.