

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 20
సిద్ధవటం నలంద పాఠశాల నందు పొన్నవోలు కొత్తపల్లి వైద్య అధికారి జె. ప్రవీణ్ కుమార్ మరియు సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవం గురించి ఆ పాఠశాలలోని పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం గా పాటిస్తారని కారణం బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ ఆవిష్కరణను గుర్తుచేసుకునే రోజు. ఇది ప్రపంచ దోమల దినోత్సవాన్ని పాటించడం సర్ రోనాల్డ్ రాస్ కు నివాళి అర్పించే మార్గం. సర్ రోనాల్డ్ రాస్ మలేరియా మరియు దోమల మధ్య సంబంధం ఉందని ఆయన 1897 లో కనుగొన్నారు సర్ రోనాల్డ్ రాస్ గారు 1902 లో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు. ఈ మలేరియా ఆడ అనాఫిలిస్ దోమ మనుషులను కుట్టినప్పుడు అది మలేరియా పరాన్న జీవిని వారి శరీరంలోకి బదిలీ చేస్తుందని అతను కనుగొన్నాడు. ఈ మలేరియా ఒక పురాతన వ్యాధి అని ఇది చాలా క్రితం నాగరికతలలో కూడా ఉంది అని దీనితో ప్రజలు తీవ్రమైన జ్వరాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని మరియు ఈ మలేరియా వలన చాలామంది ప్రాణాలు కోల్పోయారని వివరించడం జరిగింది. 1897లో రోనాల్డ్ రాస్ గారు ఆగస్టు 20న మలేరియా పరాన్న జీవి వలన వస్తుందని కనుగొన్నారు. ఈ పరాన్న జీవి రక్తంలో వ్యాధిని ఎలా కలిగిస్తుందో మరియు ప్రజలను ఎలా వ్యాధిగ్రస్తులను చేస్తుందో ఆయన వివరించి చూపించారు. మలేరియాకు కారణం ప్లాస్మోడియం జాతికి చెందిన ప్రోటోజోవాన్ పరాన్న జీవి అని. ఇది అనాఫిలిస్ అనే ఆడ దోమ జాతికి చెందినదని ఆయన కనుగొన్నారు. 2025 ప్రపంచ దోమల దినోత్సవం యొక్క ఉద్దేశం. మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియా పై పోరాటాన్ని వేగవంతం చేయడం. ఈ సంవత్సరం మలేరియా నివారణ గుర్తింపు. మరియు చికిత్సను ప్రాప్యతలో అంతరాలను మూసివేయడం యొక్క ప్రాముఖ్యతను ముఖ్యాంశముగా చేస్తుంది. అని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీనరసమ సూపర్వైజర్స్ మౌలాలి. సిహెచ్ఓ లోకేశ్వరి. హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య ఆశ ఓబులమ్మ భారతి పద్మ కళావతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటసుబ్బయ్య . ఉపాధ్యాయులు. విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.