
పాడేరు (అల్లూరి జిల్లా) న్యూస్: VRM Media
అల్లూరి జిల్లా హుకుంపేట మండల పరిధిలో గల ఉప్ప గ్రామంను ప్రధాన కేంద్రంగా తీసుకొని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని నేడు పాడేరు ప్రధాన కేంద్రం స్థానిక ఐటీడీఏ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో స్థానిక జిల్లా కలెక్టర్ ను ఉప్ప మండల సాధన కమిటీ వినయ పూర్వకంగా కలిసి వారి ఎదుర్కుంటున్న సమస్యలు, ఇబ్బందులు నేరుగా తెలియజేసి వినతి పత్రం అందజేసి మండలం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కోరారు. అనంతరం ఉప్ప మండల సాధన కమిటీ సభ్యులు పాంగి. సింహాచలం మీడియాతో మాట్లాడుతూ మేము ఎన్నో సంవత్సరాల నుండి ఉప్ప ప్రధాన కేంద్రంగా తీసుకొని మండలం ఏర్పాటు చేయాలని అనేకమార్లు అటు ప్రభుత్వాలకు ఇటు అధికారులకు మా సమస్యలు ఇబ్బందులు తెలియజేసి విన్నవించుకుంటున్నామని అయితే గతంలో మండల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాము త్వరలోనే చేస్తామని హామీ ఇచ్చారు తప్ప నేటి వరకు అమలు చేయలేదని, నేడు ఉప్ప పరిసర ప్రాంతాల్లో సుమారు 300 పై చిలుకు గ్రామాలు అభివృద్ధికి నోచుకోక అంధకారంలో ఉన్నాయని అలాగే ఆయా గ్రామాల గిరిజనులు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని కొన్ని సందర్భాల్లో సరైన సమయానికి హుకుంపేట ఆసుపత్రికి తీసుకు వెళ్లలేక వైద్యం అందక అనేకమంది మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయని ప్రతి విషయంలో మండల కేంద్రంకి వెళ్లలేక మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణాణితం అని వాపోయారు.ఇప్పటికైనా నేటి రాష్ట్ర కూటమి ప్రభుత్వం మండలాల విభజనలో భాగంగా హుకుంపేట మండల పరిధిలో గల ఉప ప్రధాన కేంద్రంగా తీసుకొని ప్రత్యేక మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు . ప్రభుత్వం తక్షణమే మా సమస్యలపై దృష్టి సారించి మా సమస్య పరిష్కారం అయ్యేలా చేయాలని లేనియెడల సుమారు 16 పంచాయతీలకు చెందిన గిరిజనులందరూ మమేకమై ఉప్ప మండలంగా ప్రకటించే వరకు ఉద్యమాలు, దీక్షలు చేపడతామని తెలిపారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird