Home ఆంధ్రప్రదేశ్ కడప రిమ్స్ ఆసుపత్రిలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం

కడప రిమ్స్ ఆసుపత్రిలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం

by VRM Media
0 comments

కడప రిమ్స్VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 23

కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు కడప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నిర్మించబడిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ను ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు పాల్గొని ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం కావడం వల్ల ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కడప జిల్లాలో వైద్యరంగాన్ని మరింత అభివృద్ధి చేసి, సాధారణ ప్రజలకు సులభంగా వైద్యం అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

2,920 Views

You may also like

Leave a Comment