Home వార్తలుఖమ్మం కేంద్రం ఇచ్చిన యూరియాలో మిగులు యూరియా చోరీ చేసింది ఎవరు. కల్లూరు సబ్ కలెక్టర్ కు వినతి పత్రం

కేంద్రం ఇచ్చిన యూరియాలో మిగులు యూరియా చోరీ చేసింది ఎవరు. కల్లూరు సబ్ కలెక్టర్ కు వినతి పత్రం

by VRM Media
0 comments

బిజెపి పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు.

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

బిజెపి పాలిత రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్రానికి గత పది సంవత్సరాలుగా కేంద్రం నుంచి అందించే యూరియాలో తొమ్మిది లక్షల టన్నుల మిగులు యూరియాను చోరి చేసింది ఎవరు?అని బిజెపి ఖమ్మం పార్లమెంటరీ పార్టీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు అన్నారు.

కల్లూరు పట్టణంలో మండల బిజెపి అధ్యక్షుడు గుమ్మ రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, బైక్ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం నంబూరి రామలింగేశ్వర రావు మాట్లాడుతూ పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చిన యూరియాలో వినియోగించగా మిగిలిన 9 లక్షల టన్నుల యూరియా పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ప్రచారం నిర్వహిస్తున్న దాంట్లో వాస్తవం లేదని అన్నారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి దారి మళ్లిన యూరియాను గుర్తించి,దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించి తక్షణమే రైతులకు యూరియా అందించాలని అన్నారు. సరియైన సమయంలో అందించలేక పోతే ప్రతి ఎకరాకు 25 వేల చొప్పున రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని బిజెపి పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల బిజెపి నాయకులు ప్రబారి కుమిలి, శ్రీనివాస్, తుమ్మలపూడి పుల్లారావు, వెంకట్రామిరెడ్డి,అప్పారావు,పసుపులేటి సుబ్బారావు, వెంకట్రామయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఆనంది నరసింహారావు, రంగు రవి, వంగల శ్రీనివాసరావు, జరకల నాగులు, కల్లేపల్లి భీమరాజు, కృష్ణారెడ్డి, వినయ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

2,891 Views

You may also like

Leave a Comment