Home ఆంధ్రప్రదేశ్ కుల మతాలకు అతీతంగా నిరుపేదలకు సహాయం చేయడమే నూరుల్లా ట్రస్ట్ దృఢ సంకల్పం.

కుల మతాలకు అతీతంగా నిరుపేదలకు సహాయం చేయడమే నూరుల్లా ట్రస్ట్ దృఢ సంకల్పం.

by VRM Media
0 comments

అక్టోబర్ 28 29 తేదీలలో జరగబోయే ఇస్తిమా సమావేశాలకు ముస్లిం సోదరులు హాజరు కావాలి.

VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి రవిబాబు ఆగస్టు 23

మలకాటిపల్లి సమీపంలో ఉన్న నూరుల ట్రస్ట్ నందు సెప్టెంబర్ 28,29 తేదీలలో జరుగు ఇస్దిమా సమావేశానికి ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని జామియా నూరుల్లా ట్రస్టు అధినేత అబ్దుల్ సుభాన్ పిలుపునిచ్చారు.శనివారం నిరుపేదలకు,ఇమామ్లు, మౌజన్లకు కుల మతాలకు అతీతంగా ఆయన పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదరసా నందు సెప్టెంబర్ నెల 28,29 తేదీలలో ఇస్తిమా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా అన్ని రకాల జబ్బులకు ఆయుర్వేద ఔషధాలతో నయం చేస్తామన్నారు.ఈ ఇస్తిమా కార్యక్రమానికి కడప జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్,ఢిల్లీ నుంచి మత పెద్దలు హాజరవుతారన్నారు
ఈ సమావేశానికి జమాతీలు కూడా పాల్గొంటారన్నారు.జమాతీల ముఖ్య ఉద్దేశం ప్రజలకు సేవ చేయడం దైవ మార్గంలో నడుస్తూ వారి సొంత డబ్బుతో తమ విలువైన సమయాన్ని కేటాయించి గ్రామ గ్రామానికి తిరిగి ప్రజలకు సేవలందిస్తారన్నారు ఏ గ్రామంలో అయితే ముస్లిం సోదరులు ఉండి మసీదు లేనిచో అక్కడ మసీదు ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు.

2,899 Views

You may also like

Leave a Comment