
VRM న్యూస్ ఒంటిమిట్ట.బాల మౌలాలి ఆగస్టు 29
ఒంటిమిట్ట మండలంలో నోటీసులు అందుకున్న పించనుదారులు తమ పించను పొందేందుకు తప్పనిసరిగా ఎంపీడీవో కార్యాలయంలో అర్జీలు సమర్పించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్నవారు సమయానికి స్పందించి అర్జీలు ఇవ్వకపోతే భవిష్యత్తులో పించను పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ఆయన హెచ్చరించారు. తమ అర్జీలు ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించిన వారికి వచ్చే నెల ఒకటో తారీఖునే పించన్లు అందజేయబడతాయని ఆయన స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న పించనుదారులందరూ నిర్ణీత గడువులోపే తమ వివరాలు సమర్పించి ప్రయోజనం పొందాలని కోరారు. ఈ విషయంపై గ్రామ స్థాయి నాయకులు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని బొబ్బిలిరాయుడు సూచించారు.