
ఆసరా పింఛను దార్లసభ విజయవంతం చేయగలరు
ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి పిలుపు
కల్లూరు VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నేడు కల్లూరు రానున్న సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆసరా పింఛన్దారులు అధిక సంఖ్యలో పాల్గొని, కల్లూరు కృష్ణ మార్కెట్ యార్డ్ లో జరుగు సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు పెంచుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోనందున ఆసరా పెంచుదారులు సెప్టెంబర్ నెలలో హైదరాబాదులో జరిగే బహిరంగ సభ విజయవంతం కొరకు కల్లూరు లో నేడు జరుగుతున్న సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని, వికలాంగుల ఆసరా పింఛన్దారులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ సభకు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు వృద్ధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సునీల్ మాదిగ, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి దారెల్లి వెంకటేశ్వరరావు, కల్లూరు మండల ఎంఆర్పిఎస్ నాయకులు ఖమ్మంపాటి పుల్లారావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, వెంగళ వెంకటేశ్వర్లు, నల్లగట్ల వేణు, నల్లగట్ల కోటేశ్వరరావు, ఖమ్మంపాటి వెంకటేశ్వర్లు, మోదుగు రమేష్,మాతిపోగు రాము, టౌన్ అధ్యక్షులు ఆదూరు కిరణ్ కుమార్, మాజీ ఎంపీపీ జొన్నలగడ్డ గోపాలస్వామి, కిన్నెర యాకూబ్,జొన్నలగడ్డ నవీన్, కొరకొప్పు ప్రసాద్, మల్లాది ప్రసాద్, చెరుకుమల్లి శేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird