Home ఆంధ్రప్రదేశ్ టిడిపి నేతలకు ఘనసత్కాలం

టిడిపి నేతలకు ఘనసత్కాలం

by VRM Media
0 comments


వినాయకుని వేడుకల్లో టిడిపి నేతల సందడి
ఉట్టిబడిన తెలుగు సంప్రదాయం
ఊరూరా పల్లెల్లో సందడి

సిద్దోటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు30

వినాయక చవితి వేడుకల్లో భాగంగా సిద్ధవటం మండలంలోని పాలకొండ్రాయిని పల్లె గ్రామంలో టిడిపి నేత రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్ని చాటుకున్నాయి గ్రామంలో ఒక్కసారిగా యువత కేరింతలతో హోరెత్తాయి ఎటు చూసినా జనంతో పలు రహదారులు కిక్కిరిసిపోయాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో వినాయక ఉత్సవ కమిటీ వేడుకల్లో భాగంగా కొన్ని ఆంక్షలు ఎత్తి వేయడంతో సంబరాలు ఊపొందుకున్నాయి ఈ సందర్భంగా టిడిపి నేత కుప్పాల మాట్లాడుతూ
వినాయక చవితి వేడుకల్లో భాగంగా గత నాలుగు రోజులుగా గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు మరియు వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశామని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా గణనాథుడి ఆశీర్వాదం ఉండాలని చెప్పిన ప్రతి వాగ్దానం అమలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన సుపరిపాలనగా మారి ప్రజలు సంతోషంగా ఉండాలని గత ఐదేళ్లలో వినాయకుని ఉత్సవాలకు ఎన్నో ఆంక్షలు పెట్టి పల్లె ప్రాంతాల్లో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని మా ప్రభుత్వంలో ఊరూరా ప్రజలు ప్రజలసంతోషంగా పండుగ చేసుకుంటున్నారని తెలిపారు వినాయకుని ఉత్సవాల్లో పాల్గొన్న టిడిపి మండల టిడిపి నేతలకు టిడిపి సీనియర్ నేత రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆల్గనేజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి నేతలు పుత్త రామచంద్రయ్య, కాడే చెంచయ్య నాయుడు, దారపునేని రాజా నాయుడు, కృష్ణ, నాగ ముని రెడ్డి మల్లు వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు

2,840 Views

You may also like

Leave a Comment