రాజంపేట బోయినపల్లిలో పెన్షన్ కార్యక్రమానికి విచ్చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు – సిద్ధవటం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చిన నాగముని రెడ్డి
సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 30
రేపు (1వ తేది) రాజంపేట బోయినపల్లిలో జరగనున్న పెన్షన్ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలుకుతున్న పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి .
సిద్ధవటం మండలంలోని టిడిపి కార్యకర్తలు, అభిమానులు, అందరూ ఈ కార్యక్రమానికి తప్పక విచ్చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగముని రెడ్డి గారు, " ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 మరియు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజలకు అమూల్యమైన వరప్రసాదాలు. వాటి ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలు లబ్ధి పొందుతూ, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి" అని అభిప్రాయపడ్డారు.
అలాగే, "టిడిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎల్లప్పుడూ ప్రజల జీవనోపాధిని బలోపేతం చేసేలా, భవిష్యత్ తరాల ప్రగతికి దోహదపడేలా ఉంటాయి. రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుంది " అని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
రేపటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కార్యకర్తలను ఆయన పిలుపునిచ్చారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird