Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట మండలం అభివృద్ధి కోసం పాటుపడుతున్న పంచాయతీ కార్యదర్శి సుధాకర్ కు హ్యాట్సాఫ్ అంటున్న ఒంటిమిట్ట ప్రజలు.

ఒంటిమిట్ట మండలం అభివృద్ధి కోసం పాటుపడుతున్న పంచాయతీ కార్యదర్శి సుధాకర్ కు హ్యాట్సాఫ్ అంటున్న ఒంటిమిట్ట ప్రజలు.

by VRM Media
0 comments

VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు ఆగస్టు 30

ఒంటిమిట్ట మండలం
ఒంటిమిట్ట మండలంలో పంచాయతీ కార్యదర్శి గా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఒంటిమిట్టలో శుభ్రత పరిశుభ్రత గురించి శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఒంటిమిట్ట డంపింగ్ యార్డ్ కు చుట్టూ ముళ్ల కంచ వేయించి ఎప్పుడు లేని రీతిలో డంపింగ్ యార్డ్ ను ఏర్పరిచారు. అంతేకాకుండా . డంపింగ్ యార్డులో చెట్లు నాటించే ఏర్పాటు కూడా చేశారు. అలాగే డంపింగ్ యార్డ్ లో ఎరువుల తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో సందు సందు వీధి వీధి తిరుగుతూ శుభ్రత పరిశుభ్రత గురించి ప్రజలలో మమేకమై వారిని జబ్బుల బారిన పడకుండా కాపాడుచున్నారు. ఒంటిమిట్ట ప్రజలు పందుల భారీ నుండి రక్షణ కోరగా వాటిని కూడా పందుల యజమానులకు చెప్పి వాటిని కూడా ఒంటిమిట్టలో లేకుండా చేశారు ఇలాంటి పంచాయతీ కార్యదర్శి ప్రతి మండలంలో ఉండాలని కోరుకుందాం.
ఒంటిమిట్ట సచివాలయానికి మరియు ఒంటిమిట్ట సాయిబాబా గుడి దగ్గర కోదండరామస్వామి దేవస్థానం దగ్గర శుభ్రత పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి ప్రజల్లో అవగాహన కలిగేటందుకు ఎలక్ట్రానిక్ స్క్రోలింగ్ లైట్లు కూడా అమర్చారు ఇటువంటి పంచాయతీ కార్యదర్శి మండలానికి ఒక్కరు ఉంటే చాలు అనేలా ఒంటిమిట్ట ప్రజల హృదయాల్లో నిలిచారు. ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్.

2,850 Views

You may also like

Leave a Comment