Home ఆంధ్రప్రదేశ్ సీఎం పర్యటన ఏర్పాట్లకు సర్వం సిద్ధం*

సీఎం పర్యటన ఏర్పాట్లకు సర్వం సిద్ధం*

by VRM Media
0 comments

జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

రాజంపేట/రాయచోటి, ఆగస్టు 31:-

*రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తేదీన రాజంపేట మండలం బోయనపల్లి గ్రామంలో పాల్గొనబోయే పేదల సేవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. ఆదివారం రాజంపేట మండలంలోని బోయినపల్లి గ్రామంలో సీఎం ఏర్పాట్లకు సంబంధించి హెలీప్యాడ్, దోబీ ఘాట్, ఎన్టీఆర్ పింఛన్ లబ్ధిదారుల ఇండ్లు, ప్రజా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ భావన, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు అనుగుణంగా వేదిక నిర్మాణం, పాల్గొనే లబ్ధిదారుల కోసం కూర్చోవడానికి అవసరమైన సదుపాయాలు, త్రాగునీటి వసతి, శానిటేషన్, పార్కింగ్ సంబంధిత ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు.

ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా అధికార బృందాలు సకాలంలో పనులను పూర్తి చేసారన్నారు. పర్యటనలో ముఖ్యమంత్రి స్వయంగా పలకరించబోయే రజక లబ్ధిదారుల జాబితా, వారికి అందించబోయే ప్రయోజనాలు, సౌకర్యాలు క్షుణ్ణంగా సమీక్షిస్తారన్నారు. సమావేశానికి హాజరయ్యే ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

*వేదిక పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీసీ కెమెరాలు, క్షేత్ర స్థాయి భద్రతా బలగాలను విస్తృతంగా మోహరించారన్నారు. ప్రజల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రణాళిక చేపట్టామన్నారు. పర్యటనలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణ సేవలు అందించేలా వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచామన్నారు.

విద్యుత్, నీటి సరఫరా, కమ్యూనికేషన్, శానిటేషన్, రవాణా వంటి విభాగాలన్నీ ఒకే తాటిపై పనిచేస్తూ ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేశారని కలెక్టర్ వివరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు క్రమశిక్షణతో పాల్గొని ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి విజ్ఞప్తి చేశారు.

2,824 Views

You may also like

Leave a Comment