Home ఆంధ్రప్రదేశ్ అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి..

అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి..

by VRM Media
0 comments

  • జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్1

వైయస్సార్ కడప జిల్లా, సెప్టెంబర్ 1:- ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్ సమావేశ హాలు నందు.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తోపాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయికి స్వయంగావెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు.క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. ఎండార్స్ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు.పిజిఆర్ఎస్ లో రీ ఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలి. జిల్లా అధికారులు మీకు వచ్చిన అర్జీలను సమయం కేటాయించి రివ్యూ చేయాలన్నారు. ఎవరైనా అర్జిలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు.అలాగే అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ ఏ లేకుండా చూడాలన్నారు.అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా.. ప్రజల నుండి అందిన కొన్ని విజ్ఞప్తులు..
1) చక్రాయిపేట మండలానికి చెందిన చెందిన వెంకటసుబ్బయ్య ఊరు నందు సొంత భూమి ఉందని ఆ భూమిని ఆక్రమించారని తగు విచారణ జరిపించి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుతూ అర్జీని సమర్పించారు.
2) కమలాపురం మండలం వికలాంగుల కాలనీకి చెందిన బి పుల్లయ్య కొందరు వ్యక్తులు భూమి ఆక్రమించారని, తగు విచారణ జరిపించి మాకు భూమిని ఇప్పించాలని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కారక వేదికలో అర్జీని సమర్పించారు.
అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అరవై రోజుల విస్తృత ప్రచారం కల్పించాలని గోడప్రతులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్డీసి వెంకటపతి,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స.పౌ.శాఖ, వై ఎస్ ఆర్ జిల్లా, కడప వారిచే విడుదల.

2,825 Views

You may also like

Leave a Comment