
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 1
రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో మరో 20 ఏళ్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని టిడిపి రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు మండలంలోని పాలకొండ్రాయిని పల్లెలో సోమవారం సాయంత్రం వినాయక చవితి ఉత్సవాల భాగంగా ఆయన పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసే ప్రతి పనిలో తొలి పూజ విఘ్నేశ్వరునికి పూజిస్తామని అలాంటి వేడుకలకు ఎక్కడ ఆటంకం కలగకుండా గ్రామ గ్రామాన వినాయకుని వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో గణేష్ ని మంట పాలకు ఉచిత విద్యుత్, వంటి సౌకర్యం ఇవ్వడం మా ప్రభుత్వానికి దక్కుతుందని గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వినాయక చవితి వేడుకలు హాజరైన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య ఆయనకు ఘనంగా సత్కరించారు