Home ఆంధ్రప్రదేశ్ టక్కోలు పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

టక్కోలు పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 2

సిద్దవటం మండలం టక్కోలు పంచాయతీ, ఖాజీపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు పాల్గొని, నూతన పెన్షనర్లకు స్వయంగా పెన్షన్ అందజేశారు.
పెన్షన్ అందుకున్న నూతన లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జె జె లు పలుకుతూ ధన్యవాదాలు తెలిపారు. తాము ఎదురుచూసిన సాయం ఇప్పుడు అందడంతో సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అధికారం లో కొనసాగాలని వారు అభిలషించారు.
ఈ కార్యక్రమంలో సచివాలయం వెల్ఫేర్ శారదా పాల్గొన్నారు

2,851 Views

You may also like

Leave a Comment