( VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాసరాథోడ్ ): రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులైన ప్రతి ఒక్కరితో పాటుగా ప్రైవేట్ ఎలక్ట్రిషన్లకు కార్మిక శాఖ ద్వారా అందిస్తున్న ప్రమాద బీమాను 10 లక్షల వరకు ప్రభుత్వం పెంచాలని ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జడల అంజయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం పట్టణంలోని మధిర రోడ్డులో గల ఇమేజ్ ఫంక్షన్ హాల్ నందు కల్లూరు మండల అధ్యక్షుడు పథకమూడి నరసింహచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల తొమ్మిదవ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ రంగాన్ని ఆసరా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కార్మికులు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఆ క్రమంలో విద్యుత్ ప్రమాదానికి గురైతే కనీసం పక్కనున్న వారు కూడా సహాయం చేయలేని స్థితిలో ఘోరంగా తమ ప్రాణాలను కోల్పోయి తమ కుటుంబాలను కష్టాలపాలు చేసుకుంటున్నారని, అటువంటి కుటుంబాలు ఆదుకోవటానికి ప్రమాద బీమా 10 లక్షల రూపాయలతో ప్రమాద బీమా తో పాటుగా, తద్వారా వితంతువులుగా మారిన మహిళలకు 5000 రూపాయలు పెన్షన్ మంజూరు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి పిల్లలకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందించాలని ఆయన అన్నారు. భవన నిర్మాణ రంగంలో, సమయపాలన లేకుండా 24 గంటలు పని చేసే కార్మికులు ప్రైవేటు ఎలక్ట్రిషన్లని కితాభించారు. చాలు చాలు నాదాయంతో కుటుంబాలను పోషించుకుంటూ సరైన సమయానికి తిండి లేక పనులు చేస్తూ 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి దీర్ఘకాలిక వ్యాధులు చోకడంతో తమ పిల్లల్ని చదివించలేక కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్న 50 సంవత్సరాలు దాటిన ప్రైవేటు ఎలక్ట్రిషన్ లందరికీ 5000 రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి ఎలక్ట్రిషన్కు బ్యాంకు లింకేజీలతో సంబంధం లేకుండా కార్మిక శాఖ ద్వారా సగం సబ్సిడీతో లక్ష రూపాయలు రుణ సౌకర్యం అందించాలని కోరారు. ఎలక్ట్రిషన్ లందరూ ఐకమత్యంగా పనిచేసుకొని ఆత్మగౌరవంతో జీవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన విద్యుత్ ఏఈ పి. వెంకట్ మాట్లాడుతూ త్రీఫేస్ విద్యుత్ వైరింగ్ లో లోడు సమానంగా మూడు పేసులకు అందేలా వైరింగ్ చేస్తూ విద్యుత్ వృధాను అరికట్టాలని సూచించారు. మండలంలో అన్ని గ్రామాలలో ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రిషన్ లందరూ విద్యుత్తు లైన్ల వలన కానీ ట్రాన్స్ఫార్మర్ల వలన కానీ ఏదైనా ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉన్నప్పుడు విద్యుత్ శాఖ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ సమాచారం డైరెక్ట్ సిబ్బందికి గాని తనకు గాని ఇవ్వాలని వారి సెల్ నెంబర్ ను, విద్యుత్ శాఖ ఎమర్జెన్సీ నెంబర్ను కూడా వారు అందరికీ తెలియజేశారు. 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మండల ఎలక్ట్రిషన్ అందరికీ తెలియజేశారు. అనంతరం సభ నిర్వాహకులు అతిధులందరినీ శాలువాలతో, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కమిటీ జిల్లా అధ్యక్షులు ధర్నా బాలరాజు, ఉపాధ్యక్షులు వీరబాబు,ప్రధాన కార్యదర్శి ఎస్ కే హాసిన్ షరీఫ్, కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి, మండల గౌరవ అధ్యక్షులు జూపూడి జయరాజు, మీర్జా కమల్షా బేగ్, వలసల సురేష్, ఎస్.కె మోషన్ పాషా, ధర్నాసి కరుణాకర రావు, నయీమ్ భాష, భాష రాము, హరి, సంపసాల శ్రీనివాసరావు, ఎలక్ట్రిషన్లు పాల్గొన్నారు.

