VRM మీడియా న్యూస్ ప్రతి నిధి ఉమ్మడి


డీ సీ పీ భాస్కర్
అదిలాబాద్:సెప్టెంబర్,5. ఆధ్యాత్మిక కేంద్రంగా శాంతియుతంగా గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని మంచిరాల డీసీపీ భాస్కర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని వంద ఫీట్ల రోడ్డు వద్ద అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాయకుని మండపంలో డిసిపి భాస్కర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీ నీ అంజనీ పుత్ర ఎస్టేట్స్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ,మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా విలసిల్లి శాంతి, ఐక్యత తో పండుగలు నిర్వహించుకోవాలన్నారు. తెలంగాణ పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గా ప్రతి పండుగ ను వేడుక గా నిర్వహించుకుని మధుర జ్ఞాపకాలుగా మలచుకోవాలన్నారు. అనంతరం అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ, వంద ఫీట్ల రోడ్డు వద్ద వినాయకుని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, వారి సహకారం, ఆశీర్వాద బలం తో సేవాకార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను శాలువాతో సత్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, డైరెక్టర్ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.