

సిద్ధవటం:VRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 7
తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి (వాసు అన్న) గారి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యదర్శి అండ్లురి నాగముని రెడ్డి, అండ్లురి చిన్నప రెడ్డి, రాజా నాయుడు, రాజశేఖర్ యాదవ్, గంజి సుబ్బారాయుడు, జింక శ్రీను, పి. శ్రీనివాసులు, చంచయ్య నాయుడు, సింగం సుబ్బారాయుడు, బండి ఓబులేసు, జింక ఓబులేసు తదితరులు వాసు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
నాయకులు మాట్లాడుతూ వాసు అన్న గారు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ, కార్యకర్తలకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారని, ఆయనకు మరిన్ని విజయాలు, ఆరోగ్య సౌఖ్యాలు కలగాలని ఆకాంక్షించారు.