


సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 7
నిన్నటి రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు సిద్ధవటం మండలంలోని మాధవరం 1 గ్రామపంచాయతీ పార్వతీపురం లోని టిడిపి నాయకులు ఉప్పల కొండయ్య. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వారు తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మండల నాయకులు ఈరోజు ఉప్పల వారి ఇంటికి వెళ్లి కొండయ్య గారి పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా కొండయ్య గారు గతంలో పార్టీకి ఎంతో సేవ చేశారు పైగా కుటుంబం నుంచి ముగ్గురు టిడిపి వారసులను పార్టీకి అందించారని వారి సేవలు ఎనలేనివని ఇక్కడికి వచ్చిన మండల నాయకులు గుర్తు చేసుకున్నారు. వారి కుమారులు టిడిపి నాయకులు ఉప్పల వెంకటేష్ మరియు టిడిపి బూత్ ఇంచార్జ్ ఉప్పల రామకృష్ణ మరియు వారి అల్లుడు పార్టీ సీనియర్ నాయకుడు మలాతుల బాలసుబ్రహ్మణ్యం లను కలిసి కొండయ్య గారి మృతి పట్ల సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి క్లస్టర్ ఇంచార్జ్ దశరథ రామానాయుడు నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు డా. నాగూరు వీరభద్రుడు భాకరాపేట సర్పంచ్ ప్రతినిధి తుర్ర ప్రతాప్ నాయుడు మాధవరం టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు బొడ్చర్ల వెంకటరత్నం యువ నాయకులు పెగడ హరి ప్రసాద్ మరియు మామిళ్ల మురళి రాయల్ ఉప్పల శివ, మాడా శివ తదితరులు పాల్గొన్నారు.