👉సంకష్టహర చతుర్థి పర్వదినం సందర్భంగా స్థానిక తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద
👉విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు, శ్రీమతి పద్మావతి దేవి గంగారత్నం దంపతులచే, అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాధరావు శర్మ లక్ష్మీ గణపతి హోమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
👉ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ, సంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఏటా పాడి పంటలు బాగా పండాలని, అన్నదాతలు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, అన్ని రంగాల వారు, ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో
👉ప్రతి నెల లోక కళ్యాణార్థం లక్ష్మి గణపతి హోమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కంబాల శ్రీనివాసరావు గారు తెలిపారు.
👉ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.