Vrm media ఖమ్మం ప్రతినిధి



భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన కమిటీలో ఖమ్మం జిల్లా నాయకుడు దేవకి వాసుదేవరావుకి కీలక బాధ్యతలు లభించాయి. తాజాగా ప్రకటించిన జాబితాలో ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
ఈ జాబితాలో ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, దేవకి వాసుదేవరావును హృదయపూర్వకంగా అభినందించారు.
ఖమ్మం జిల్లా నాయకుడిగా దేవకి వాసుదేవరావు రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టడం పార్టీ బలపడేందుకు తోడ్పడుతుందని భాజపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird