
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 10
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా భువనేశ్వరమ్మ గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం ఉదయం పెళ్లిరోజు వేడుకలను ఘనంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి మరియు టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ దశరధ రామానాయుడు వారు మాట్లాడుతూ మన విజనరీ లీడర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రామికుడు, అమరావతి రూపకర్త, పేద ప్రజల పాలిటి పెన్నిధి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు కలకాలం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. వారు అనుభవంతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి దిశగా తీసుకు వెళ్తూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర పురోగతికి కృషి చేయాలని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ నాగూరు వీరభద్రుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వాహన కార్యదర్శి కాడే శ్రీనివాసులు నాయుడు , భాకరాపేట సర్పంచ్ ప్రతినిధి ప్రతాప్ నాయుడు, ఉపసర్పంచ్ ప్రతినిధి నర్సింహారెడ్డి, మాధవరం 1 గ్రామంలోని బిట్టా వెంకటసుబ్బయ్య, బండి ఓబులేసు,మురళి రాయల్, జానపాటి సుబ్బరాయుడు చేపూరి నర్సింహులు తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*.