Home ఆంధ్రప్రదేశ్ సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని

సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని

by VRM Media
0 comments

సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని

ఒంటిమిట్ట VRM న్యూస్ రిపోర్టర్ మౌలాలి సెప్టెంబర్ 11

ఒంటిమిట్ట మండలంకొత్త మాధవరం కొండమాచపల్లి చెంచు గారి పల్లి మరియు రైల్వే కాలనీ యందు డాక్టర్ సి భావన రెడ్డి జిల్లా సహాయ మలేరియా అధికారి ఏ వెంకటరెడ్డి మరియు సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో
ఒంటిమిట్ట మండలం ఈ నాలుగు గ్రామాలలో మలేరియా డెంగ్యూ చికెన్ గున్య మరియు డయేరియా గురించి అక్కడి ప్రజలకు వివరించడం జరిగినది ఈ మలేరియా డెంగ్యూ జ్వరాలు మన పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం వలన ఆ ప్రదేశాలలో దోమలు గుడ్లు పెట్టి లార్వా ప్యూప అడల్ట్ దశ అనగా దోమగా మారి అవి మనల్ని కుట్టి ప్రజల్ని మలేరియా డెంగ్యూ జ్వరాల బారిన పడేటట్లు చేస్తాయి కనుక మన ఇంటి పరిసరాల చుట్టూ మరియు మన గ్రామ పరిసరాల చుట్టూ నీటి నిలువలు లేకుండా చూసుకోవడం వలన ప్రతి శుక్రవారం ఫ్రైడే మరియు డ్రై డే పాటించడం వలన అనగా మన ఇంటిలోని నీటి అంతా పార బ్రోసి కొత్తగా నీరు పట్టుకోవడం వలన మన ఇండ్లలో ఉండే కూలర్లు నీటి తొట్టెలు పూల కుండీలు లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం వలన వేపాకు పొగ వేసుకోవడం వలన ఒంటికి నిండుగా దుస్తులు వేసుకోవడం వలన రాత్రిపూట దోమతెరలు వాడటం వలన ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ దోమల బారి నుండి చాలావరకు కాపాడుకోగలుగుతాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నాలుగు గ్రామాలలో ఆరోగ్య సిబ్బంది లార్వా సర్వే మరియు ఫీవర్ సర్వేచేశారు గ్రామాలలో అక్కడక్కడ కొద్దిపాటి స్వల్ప జ్వరాలు ఉంటే అక్కడ రక్త పూతలు నిర్వహించడం జరిగినది గ్రామాలలో ఎక్కడే గాని మలేరియా డెంగ్యూ జ్వరాలు ప్రస్తుతం లేవు వాతావరణం మార్పుల వల్ల అక్కడక్కడ విరోచనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక మీరందరూ శారీ రక శుభ్రత మరియు వ్యక్తిగత శుభ్రత తప్పకుండా పాటించాలని అక్కడ ప్రజలకు ఆరోగ్య సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ డి భాస్కర్ రెడ్డి హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య ఏఎన్ఎమ్స్ షబానా ఉమాదేవి ఎంఎల్ హెచ్పి వనిత ఆశా కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది

2,836 Views

You may also like

Leave a Comment