Home ఆంధ్రప్రదేశ్ ఘనంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీ వినాయక విగ్రహం ఊరేగింపు….

ఘనంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీ వినాయక విగ్రహం ఊరేగింపు….

by VRM Media
0 comments

ఊరేగింపులో పాల్గొన్న “కంబాల”

భారీ వినాయక విగ్రహం ఊరేగింపు కార్యక్రమానికి కంబాల 2 లక్షలు రూపాయలు విరాళం

కంబాల శ్రీనివాసరావు గారిని గజమాలతో ఘనంగా సత్కరించిన కమిటీ కుర్రాళ్ళు

  • 👉తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంప్లెక్స్ కమిటీ కుర్రాళ్ళు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు గల భారీ వినాయక విగ్రహం ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది.
  • 👉ఈ ఊరేగింపు కార్యక్రమంలో కమిటీ కుర్రోళ్ళు ఆహ్వానం మేరకు విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.
  • 👉తొలిత కంబాల శ్రీనివాసరావు గారు కొబ్బరికాయ కొట్టి, జెండా ఊపి ఊరేగింపుని ప్రారంభించారు
  • 👉 ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న కంబాల శ్రీనివాసరావుని వినాయక మండపం కమిటీ కుర్రాళ్ళు గజమాలతో ఘనంగా సత్కరించారు.
  • 👉అనంతరం ప్రధాన రహదారిలో జన సందోహం మధ్య ట్రాలిపై ఊరేగింపు కార్యక్రమం బాణసంచ కాల్పులతో, కోలాటం, పలు నృత్యాలతో అంగరంగ, వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం తరలించి గోదావరిలో వినాయకుని నిమజ్జనం చేశారు
2,838 Views

You may also like

Leave a Comment