
సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 12
సిద్ధవటంమండలంలోని మాధవరం1 గ్రామపంచాయతీ ఎస్కే ఆర్ నగర్ హరిజనవాడ ఎస్సీ సామాజిక వర్గ సీనియర్ టిడిపి నాయకుడు పెండెం గురయ్యా రాష్ట్ర నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ నాగూరు వీరభద్రుడు గారిని పూలమాలతో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గురయ్య మాట్లాడుతూ డాక్టర్ వీరభద్రుడు గారికి స్టేట్ డైరెక్టర్ పదవి రావడం గ్రామానికి మండలానికి అదేవిధంగా నియోజకవర్గానికి ఎంతో గర్వకారణం అనీ, ఎన్నో ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగితూ, కష్టాలు ఎన్ని ఎదురైనా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా పార్టీనే పరమావధిగా భావించి తన ప్రాక్టీసును కూడా పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గంలోని మిగతా మండలాలతో పోటీపడే విధంగా చేస్తూ గ్రామ ప్రజలకు డాక్టర్ గానే కాకుండా తెలుగుదేశం కార్యకర్తగా నాయకుడిగా ఎనలేని సేవలు అందించిన డాక్టర్ వీరభద్రుడికి మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు సరైన సన్మానం ఒక మంచి పదవిని ఇచ్చి జరిపారని ఆయన ఆనందంగా తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ వీరభద్రుడు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు చేకూర్చి అష్టైశ్వర్యాలు పేరు ప్రతిష్టలు పొందే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాదారం టిడిపి యువ నాయకులు మామిళ్ల మురళి రాయల్, 31 బూతు కో కన్వీనర్ జానపాటి సుబ్బరాయుడు పాల్గొన్నారు.
స్టేట్ డైరెక్టర్ మాట్లాడుతూ గురయ్య గారు చూపుతున్న ప్రేమాభిమానాలు ఎంతో సంతోషకరమని ఇటువంటి నాయకులతో, కార్యకర్తలతో కలిసి పనిచేయడం నాకు గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird