Home ఆంధ్రప్రదేశ్ ఫీవర్ సర్వే లార్వా సర్వే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నరసన్న గారి పల్లె మరియు పెన్న పేరూరు గ్రామాలలో జిల్లా మలేరియా అధికారిE. మనోరమ

ఫీవర్ సర్వే లార్వా సర్వే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నరసన్న గారి పల్లె మరియు పెన్న పేరూరు గ్రామాలలో జిల్లా మలేరియా అధికారిE. మనోరమ

by VRM Media
0 comments

ఒంటిమిట్ట VRM న్యూస్ రిపోర్టర్ మౌలాలి సెప్టెంబర్ 12

ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు C. భావన రెడ్డి గారు మరియు సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు గార్ల ఆధ్వర్యంలో ఈ గ్రామాలలో ఫ్రైడే డ్రై డేమరియు మెడికల్ క్యాంపు ఫీవర్ సర్వే లార్వా సర్వే తగు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ఆ గ్రామాలలోని ప్రజలతో ఈ అధికారులంతా మాట్లాడుతూ మీరందరూ ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డేతప్పకుండా పాటించాలని అలా పాటించడం వలన మనకు లార్వా అంతమవుతుందని దీని ద్వారా దోమలు ఉత్పత్తి కాకుండా మరియు ఆ లార్వా ప్యూపగా మరియు అడల్ట్ దశ అనగా దోమగా రూపాంతరం చెంది అవి మనల్ని మన ఇంటిలో వారిని మన చుట్టుపక్కల వారిని కుట్టకుండా ఉంటాయని ఒకవేళ ఈ దోమలుకుట్టినప్పుడు మలేరియా డెంగ్యూ చికెన్గునియా లాంటి జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయని ఇవి ఒక్కొక్కసారి మనిషికి తీవ్ర అస్వస్థత పాలు చేసి మనుషులను చాలా ఇబ్బంది పెడతాయి ఒక్కొక్కసారి ప్రాణాపాయం కలిగే స్థితికి కూడా తీసుకొస్తాయి కనుక మనము మన ఇంటి చుట్టూ మరియు మన పరిసరాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం వలన మరియు మన ఇంటికి కొద్దిగా దూరంగా పశువుల పాకలు ఏర్పరచుకోవడం వలన పేడ దిబ్బలు మన ఇంటికి మన పరిసరాలకు కొద్దిగా దూరంగా వేసుకోవడం వలన రాత్రిపూట వేపాకు పొగ వేసుకోవడం వలన మన ఇండ్ల కిటికీలకు దోమల వలలు అమర్చుకోవడం వలన రాత్రిపూట దోమతెరలు వాడటం వలన ఒంటికి నిండైన దుస్తులు వేసుకోవడం వలన మన పరిసరాల పరిశుభ్రత మరియు శారీరక శుభ్రత పాటించడం వలన మన ఇండ్ల చుట్టూ పెద్దపెద్ద నీళ్ల గుంటలు ఉంటే అందులో వేస్ట్ ఆయిల్ వేయడం వలన మన ఇండ్లలోని నీటి తొట్టెలు పూల కుండీలు ఎయిర్ కూలర్లు పనికిరాని టైర్లు కొబ్బరి బొండాలు ఇలాంటి వాటిల్లో నీరు నిలువ లేకుండా చేసుకోవడం కొద్దిపాటి దగ్గు జలుబు జ్వరాలు ఉంటే మీ దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించుకోవడం వలన పగటిపూట దోమలు కుట్టకుండా చూసుకోవడం వలన మరియు రాత్రిపూట దోమలు కుట్టకుండా చూసుకోవడం వలన ఈ జ్వరాల బారి నుండి మనల్ని మనము రక్షించుకోవచ్చునని అక్కడి ప్రజలకు ఆరోగ్య బోధన మరియు సలహాలు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా పెన్న పేరూరు ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేయడం జరిగినది అక్కడ విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత చేతుల శుభ్రత గురించి మరియు దగ్గు జలుబు లాంటి వాటికి చికిత్స చేయడం జరిగినది ఈ రెండు గ్రామాలలో ఆరోగ్య సిబ్బంది కలియతిరిగి ఫీవర్ సర్వే లార్వా సర్వే నిర్వహించడం జరిగినది గ్రామాలలో అక్కడక్కడ కొద్దిపాటి స్వల్ప దగ్గు జలుబు జ్వరాలు ఉంటే అక్కడే రక్త పరీక్షలు నిర్వహించడం జరిగినది ప్రస్తుతం ఈ గ్రామాలలో మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు లేవు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది అయినా సూపర్వైజర్ C. లక్ష్మీనరసమ్మ ఏఎన్ఎం S రేష్మ సోనీ హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య అక్కడి పొలిటికల్ లీడర్ C వెంకటేశ్వర్ రెడ్డి ఆశా కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది

2,851 Views

You may also like

Leave a Comment