

VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి రవిబాబు సెప్టెంబర్ 13
ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మడకల వారి పల్లి నందు కీటక జనిత వ్యాధులపై బాలికలకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి గురించి వ్యాధి లక్షణాల గురించి వాటి నివారణ గురించి వివరించడం జరిగినది ఆడ ఈడీస్ దోమ ద్వారా ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వ్యాధి వస్తుంది. విపరీతమైన వళ్ళునప్పులతో పాటు జ్వరము కూడా ఉండునని శరీరంపై దద్దులు ఏర్పడునని, వాoతులు కూడా అవుతాయని చెప్పడం జరిగినది,ఇలాంటివ వారిని కనుగొని వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్షలు చేయించాలని చెప్పడం జరిగినది.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వి శివరామిరెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని, కీటకాలు ద్వారా వచ్చే ఐదు వ్యాధుల గురించి వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆప్తమిక్ ఆఫీసర్ మాట్లాడుతూ కంటికి సంబంధమైన వ్యాధుల గురించి చెప్పడం జరిగినది అందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగినది.ఈ కార్యక్రమం లో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఐ సుబ్బరాయుడు, హెల్త్ అసిస్టెంట్ వెంకటసుబ్బయ్య హెల్త్ సూపర్వైజర్ వి.శివరామి రెడ్డి,ఆప్తాల్మిక్ ఆఫీసర్ హుస్సేన్ అయ్య, హెల్త్ అసిస్టెంట్ కె. వెంకటసుబ్బయ్య,ప్రిన్సిపాల్ భానుమతి మేడం, ఉపాధ్యాయులు ఆశా కార్యకర్తలు ఎస్.నారాయణమ్మ పి సుజాత ఆరోగ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.