VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవి బాబు సెప్టెంబర్ 13
రాయచోటి పట్టణం లో కరూర్ వైశ్య బ్యాంకులో పనిచేస్తున్న సిహెచ్ పవన్ కుమార్ బ్యాంకు లోనే ఉరివేసుకొని మృతి.భార్య అనూష తెలిపిన వివరాల మేరకు సుండుపల్లి మండలం చప్పుడు వాండ్లపల్లి లో నివాసముండే సిహెచ్ పవన్ వృత్తి రీత్యా కరూర వైశ్యా బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు పిల్లలు. భార్య తెలిపిన వివరాల మేరకు బ్యాంకులో పని ఒత్తిడి వలన నా భర్త చనిపోయారని ఆరోపించింది. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.