

కడప అర్బన్ VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 14:
సోమశిల బ్యాక్ వాటర్ ముంపు బాధితులమైన తమకు నష్టం పరిహారం రాకుండా అడ్డుకోవడం తగదని అట్లూరు మండలం మలినేని పట్నం పంచాయతీ గొల్లపల్లెకు చెందిన సింగన శ్రీనివాసులురెడ్డి,సింగన నాగిరెడ్డిలు అన్నారు.ఆదివారం స్థానిక కడప ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ప్రస్తుతం తాము కడపలో నివాసం ఉంటున్నామని తెలిపారు.బ్యాక్ వాటర్ కు సంబం ధించి 1996 లో తమ గ్రామాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తమకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని వాపోయారు, దీంతో తాము అదే సంవత్సరంలో కోర్టును ఆశ్రయించగా 2013 లో అందరి లాగే ఇవ్వకుండా తక్కువ డబ్బు ఇచ్చారని తెలిపారు.దీంతో 2014 లో పరిహారం కోసం మల్లీ కోర్టును ఆశ్రయించగా వడ్డీ చెల్లించాలని తీర్పు ఇచ్చిందని చెప్పా రు.అయి నప్పటికీ తాము బద్వేలు వీరారెడ్డి అనుచరులుగా టిడిపిలో ఉన్నం దున, కొంత మంది గిట్టని వారు రాజకీయ పలుకుబడి ఉపయో గించి తమకు డబ్బు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు.అయితే గత రోజు ఒక ప్రధాన పత్రికలో తమకు వ్యతిరేకంగా వార్త రాశారని దీనిపై తాము చట్ట ప్రకారం పోరాడు తామని అన్నారు.కావున ఈవిష యం లో ప్రభుత్వం చొరవ చూపి మిగిలిన తమ 11 మందికి అందరి లాగే పూర్తి స్థాయిలో నష్టం పరిహా రం చెల్లించాలని కోరారు.ఈ సమా వేశంలో సింగన లక్ష్మమ్మ తదిత రులు పాల్గొన్నారు.