Home వార్తలుఖమ్మం జనసేన నుండి కాంగ్రెస్ లో చేరిక

జనసేన నుండి కాంగ్రెస్ లో చేరిక

by VRM Media
0 comments

Vrm media ఖమ్మం ప్రతినిధి


👉🏻పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
ఖమ్మం పట్టణం 51వ డివిజన్ లో గత మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసిన సింగారపు చంద్రమౌళి,48 వ డివిజన్ సీనియర్ నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు వంగూరి స్వామి లు సోమవారం కాంగ్రెస్ లో చేరారు.జిల్లా ఆర్టిఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పార్టీకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. సింగారపు చంద్రమౌళి, వంగూరి స్వామి లు మాట్లాడుతూ…. పార్టీ విలువలకు కట్టుబడి ఉంటూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పార్టీ సిద్ధాంతాలను కొనసాగిస్తానని, ఖమ్మం పట్టణ నాయి బ్రాహ్మణ సంఘ మాజి అధ్యక్షునిగా, సీనియర్ నాయీ బ్రాహ్మణ సంఘ నాయకునిగా రాజకీయపరంగా తమకు ఎంతో అనుభవం ఉందని ఆ అనుభవాన్ని అనుకరిస్తూ పార్టీ అభివృద్ధికితమ వంతు కృషి చేస్తూ , పార్టీ అభివృద్ధికి అహర్నిశలుకష్టపడి పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు పి సి సి సభ్యులు,జిల్లా ఓబీసీ సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా కాంగ్రెస్ నాయకులు మూడుముంతల గంగరాజు యాదవ్,51వ డివిజన్ అద్యక్షులు జంపాల రామకృష్ణ, మేడారపు హరినాథ్,రాచమల్ల నరసింహారావు,సింగారపు కృష్ణ,రాచమల్ల జాని,మామిడాల కుమారస్వామి, జంపాల జంపన్న, దూదిపాళ్ళ ఉపేందర్, గొల్లపూడి ఉపేందర్, దాసు నాగరాజు,రాచమల్ల హనుమంతరావు,రామవరపు నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

2,840 Views

You may also like

Leave a Comment