Home ఆంధ్రప్రదేశ్ గురుకుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలికొండా అమర్నాథరెడ్డి

గురుకుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలికొండా అమర్నాథరెడ్డి

by VRM Media
0 comments

కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 15 :

కడప జిల్లా నా కుమారుడు కన్ను పోవడానికి కారణమైన రిషి వాటిక వ్యక్తి వెంకటేష్ వేద వ్యాస భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిం చే రిషి వాటిక గురుకుల యాజ మాన్యంపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కొండా అమర్నాథ్ రెడ్డి కోరారు. సోమ వారం ప్రెస్ క్లబ్ లో ఆయన విలే కరులతో మాట్లాడుతూ నా కుమారుడు కొండా శేషాద్రి రెడ్డి అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండల పరిధిలోని గట్టు గ్రామం వద్ద ఉన్న శ్రీ వేద వ్యాసా భారతీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిషి వాటిక గురుకులంలో మూడవ సంవత్సరం విద్యను అభ్యసి స్తున్నాడని తెలిపారు. నా కుమా రుడు ఇతర విద్యార్థులతో ఆడు కుంటూ ఉండగా గురుకుల యాజమాన్యానికి సంబంధించిన వెంకటేష్ అనే వ్యక్తి రాయితో నా కొడుకును కొట్టడంతో కన్ను తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆలస్యంగా తెలిసిందన్నారు. చికిత్స చేయించిగా కన్ను పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు కట్టలేదన్న కోపంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విషయం తెలుసుకునేందుకు స్కూల్ కు వెళితే నన్నే చంపుతానని బెదిరిం చారని ఆవేదన వ్యక్తంచేశారు. నా కుమారునికి గురుకుల యాజమా న్యం నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ విషయం లో పోలీసులు నామ మాత్రం సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకు న్నారని వాపోయారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయా లని ఆయన ఉన్నతా ధికారులను కోరారు.

2,839 Views

You may also like

Leave a Comment