

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 16
రాజంపేటలోని ప్రభుత్వ వైద్యశాల నందు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కుమార్ గారి జన్మదిన పురస్కరించుకొని కేకు కట్ చేసి రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమం బిజెపి సీనియర్ నాయకులు హిమగిరి యాదవ్ మరియు పట్టు పోగుల ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తగా అంచలంచలాగా ఎదిగి బిజెపిలో జాతీయ కార్యదర్శిగా ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సత్య కుమార్ గారి జన్మదిన సందర్భంగా రాజంపేటలో కేక్ కట్ చేసి రోగులందరికీ పండ్లు బ్రెడ్ పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సూపరిండెంట్ నాగేశ్వర రాజు డాక్టర్ అనిల్ సిబ్బంది జయప్రకాష్ నర్సులు డాక్టర్లు మరియు బిజెపి సీనియర్ నాయకులు హిమగిరి యాదవ్ బిజెపి ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి పట్టు పోగుల ఆదినారాయణ బిజెపి మాజీ ఉపాధ్యక్షులు వై సురేష్ రాజు బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు సునీత వర్మ పట్టణ కార్యదర్శులు నరేంద్ర రాజు పట్టణ అధ్యక్షులు వివి రమణ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం రమణయ్య కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ పాపయ్య బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్ బిజెపి మహిళా నాయకురాలు ప్రభావతి సుబ్రహ్మణ్యం నాయుడు పత్తిపాటి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు