
సిద్ధవటంVRM న్యూస్
సిద్దవటం మండలం టక్కోలు గ్రామం లో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చంద కార్యక్రమంలో భాగంగా “గ్రీన్ AP” నినాదంతో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. గ్రామంలోని ప్రజలు ఉత్సాహంగా పాల్గొని చెట్ల నాటకం, మొక్కలకు నీరుపోసే కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞలతో ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యదర్శి నాగ ముని రెడ్డి గారు గారు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ
“పచ్చదనం పెంపొందించడం వలన మాత్రమే భవిష్యత్తు తరాలకు శుద్ధ వాయువు, తాగునీరు, ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది. ప్రతి ఇంటి వద్ద ఒక్కొక్క మొక్క నాటితే మొత్తం గ్రామం, రాష్ట్రం పచ్చదనంతో కప్పబడుతుంది. గ్రీన్ AP నినాదం కేవలం ప్రభుత్వ పిలుపు మాత్రమే కాదు, ప్రజలందరి బాధ్యత” అని అన్నారు.
సమాజంలోని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు వస్తే గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుందని సర్పంచ్ లక్ష్మి దేవి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్యం గా పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి , జగన్ మోహ