
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 20
కడప చెన్నై జాతీయ రహదారి భాకరాపేట చెక్ పోస్ట్ సమీపాన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి బలమైన గాయాలు తగిలాయి సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి భాకరాపేట చెక్ పోస్ట్ సమీపాన శనివారం కడప నుండి ద్విచక్ర వాహనంలో ముగ్గురు వ్యక్తులు అతివేగంగా వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కమల్ అనే యువకుడికి తలకు బలమైన గాయాలు తగలగా రితీష్ అనే వ్యక్తికి ఎడమ కాలు పూర్తిగా దెబ్బతినింది మున్నా అనే యువకునికిస్వల్ప గాయాలు అయ్యాయి రాజంపేట నుండి ద్విచక్ర వాహనంలో ముగ్గురు యువకులు కడపకు సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు కోసం వెళ్లి తిరిగి రాజంపేటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు 108 సిబ్బంది తెలిపారు ఘటనా స్థలానికి హైవే పెట్రోలింగ్ పోలీసులు స్థానిక మండల ఎస్సై మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు