

కడప ఏడురోడ్లు VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 21
కడప జిల్లా ఏడు రోడ్లు నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ,నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐ లవ్ మొహమ్మద్ అనే 150 అడుగుల బ్యానర్ తో నిరసన చేశారు.అలాగే ప్లే కార్డులను ప్రదర్శించారు. మిలా ద్-ఉన్-నబి వేడుకల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఐ లవ్ మొహ మ్మద్ అని బ్యానర్లను ముస్లిం యువకులు ప్రదర్శించడంతో అక్కడి యోగి ప్రభుత్వం పోలీసులు అక్రమంగా ముస్లిం యువకులపై కేసులు నమోదు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో ముస్లింలపై ఏదో ఒక రూపంలో దాడి చేస్తూ అరాచకాలు సృష్టిస్తోందని ఆందోళన కారులు తెలిపారు, ముస్లిం మైనారిటీ లోపై బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ తదితర మత చాందస్తవాదులు కుట్ర పన్నుతున్నారని దీన్ని ముస్లింలు తిప్పికొడతారని హెచ్చరించారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాలాల్లో ప్రతి ముస్లిం నడుస్తాడని తెలిపారు. ఆయన పేరు ప్రదర్శినిందుకే కేసులు నమోదు చేస్తే దేశంలోని 40 కోట్ల మంది ముస్లింలు ఒప్పుకోరని ప్రవక్త ను కించపరిచే విధంగా వ్యవహరిస్తే ముస్లిం సమాజం చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్నిఈ సందర్భంగా మత పెద్దలు హెచ్చరించారు ఈ కార్యక్ర మంలో పెద్ద ఎత్తున ముస్లిం మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంఘ సేవకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, యువత పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird