Home ఆంధ్రప్రదేశ్ ఆ,జర్నలిస్టు బాబురావు సేవలు ప్రశంసనీయం. ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం.

ఆ,జర్నలిస్టు బాబురావు సేవలు ప్రశంసనీయం. ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం.

by VRM Media
0 comments

ప్రత్తిపాడు,వి. ర్. ఎం. న్యూస్ 24, ప్రతినిధి,ప్రిన్స్, సెప్టెంబర్, 22:-

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 33 ఏళ్లుగా జర్నలిస్టుగా సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టు కొత్తూరు బాబురావు సత్యవతి దంపతులకు సోమవారం రాచపల్లి అరుణాచలేశ్వర దేవస్థానంలో ఘన సన్మానం జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు రమణానంద స్వామి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్తిపాడు ఎస్ఐ ఎస్ .లక్ష్మీకాంతం ఆలయ నిర్వాహక కమిటీ మాతాజీ నిర్మల, సభ్యులు ఎల్ తాతాజీ, జక్కా త్రిమూర్తులు, కారే శ్రీరామచంద్ర, ధర్మవరం,రాచపల్లి గ్రామ పెద్దలు సానా నూకరాజు నాయుడు, ముత్యాల సత్యనారాయణ స్థానిక పాత్రికేయులు గళ్ళ కృష్ణమోహన్, గుబ్బల శివశంకర్,బూతుకూరి బాలకృష్ణ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మీకాంతం మాట్లాడుతూ 33 ఏళ్ల పాటు పత్తిపాడు మండలంలో సుదీర్ఘ పాత్రికేయ సేవలు అందిస్తున్న జర్నలిస్ట్ బాబురావు సేవలు ప్రశంసనీయమన్నారు. అన్నమయ్య కలా క్షత్రం జిల్లా అధ్యక్షుడు సానా నూకరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల బాధ్యతాయుతంగా పనిచేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న అందరివాడు జర్నలిస్టు బాబురావుని అభినందించారు.

2,816 Views

You may also like

Leave a Comment