
-- విద్యాశాఖ మంత్రి లోకేష్ కు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వినతి
-- రాజానగరం, కోరుకొండలలో డిగ్రీ కాలేజీల ఏర్పాటు చేయాలి
-- గాదరాడ, శ్రీకృష్ణపట్నం, దివాన్ చెరువు, రాజానగరం, ప్రాంతాల్లో ఇంటర్ కాలేజీల ఏర్పాటుకు విన్నపం
--పుణ్యక్షేత్రం, గాడాల, తుంగపాడు, వెదుళ్ళపల్లి ప్లస్ టు కాలేజీలను ఇంటర్ కాలేజీలుగా అభివృద్ధి చేయాలి
-- వీటితోపాటు పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తే.. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉద్ఘాటన
--అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే బలరామకృష్ణ వినతి
-- రాజానగరం నియోజకవర్గానికి ఐటీ హబ్ మంజూరు చేయాలి
--రాజానగరంలో ఐటిఐ కాలేజీ, ఎస్ టి పి ఐ ఏర్పాటు చేయాలి
-+ఆదికవి నన్నయ యూనివర్సిటీ లో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలి
-- ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజమహేంద్రవరంలలో స్పోర్ట్స్ ప్రాజెక్టులను త్వరితను పూర్తి చేయాలి
-- మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా విన్నవించిన ఎమ్మెల్యే బలరామకృష్ణ
-- విద్యా నిలయంగా రాజానగరాన్ని అభివృద్ధి చేయడానికి సహకారం అందించాలని వినతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ , రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలిసి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరిన శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు.
👉 రాజానగరం నియోజకవర్గాన్ని విద్యా నిలయంగా, ఉన్నత విద్యకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. . విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కోరారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ .. నా రాజానగరం.. నా ప్రజలు! అంటూ ముందుకు సాగుతున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసి రాజానగరం అభివృద్ధి, తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం వినతి పత్రాలను అందించిన ఎమ్మెల్యే బలరామకృష్ణ.. సోమవారం విద్యా శాఖ మంత్రి లోకేష్ ని కలిసి రాజానగరంలో పలు విద్యాసంస్థల ఏర్పాటు, అభివృద్ధి కొరకు వినతిపత్రం అందించారు. వీటిలో ముఖ్యంగా రాజానగరం, కోరుకొండ ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీ లను ఏర్పాటు చేయాలని కోరారు. వీటితోపాటు గాదరాడ, శ్రీకృష్ణపట్నం, దివాన్ చెరువు, రాజానగరం ప్రాంతాల్లో ఇంటర్ కాలేజీ లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు నియోజకవర్గంలోనే ఇంటర్, డిగ్రీ వంటి ఉన్నత విద్యలను అభ్యసించడానికి అవకాశం ఉంటుందన్నారు. పుణ్యక్షేత్రం, గాడాల, తుంగపాడు, వెదుళ్ళపల్లి గ్రామాల్లో ప్లస్ టు కాలేజీ లను ఇంటర్ కాలేజీలుగా మార్పు చేయాలని కోరారు. అటు కాకినాడ .. ఇటు రాజమండ్రి నగరాలకు మధ్యన ఉన్న రాజానగరం ప్రాంతంలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తే యువతకు సాఫ్ట్ వేర్ రంగంలో చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. వీటితోపాటు ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ఐటిఐ కాలేజీ లను మంజూరు చేయాలని కోరారు. రాజానగరంలో ఎస్టిపిఐ ఏర్పాటు చేయాలన్నారు. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ను ఏర్పాటు చేస్తే.. యువతీ యువకులకు మేలు జరుగుతుందన్నారు. మనబడి, మన భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. రాజానగరం నియోజకవర్గంలోని ముక్కినాడ, రాధేయపాలెం గ్రామాల్లో సెల్ టవర్ల ఏర్పాటు చేయాలని కోరారు. గతంలోనే ఈ సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే బలరామకృష్ణ.. మంత్రి నారా లోకేష్ కు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందంతో విచారణ జరిపించి.. కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వీటితోపాటు ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజమహేంద్రవరంలోని స్పోర్ట్స్ ప్రాజెక్టులను త్వరితగతను పూర్తి చేయాలని విన్నవించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి వినతులపై మంత్రి నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు అడిగిన వాటిని మంజూరు చేయించడమే కాకుండా అవసరమైన సహకారాన్ని కూటమి ప్రభుత్వం నుంచి అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird