
ఏలేశ్వరం,వి.ర్.ఎం.న్యూస్, 24,ప్రతినిధి, ప్రిన్స్, సెప్టెంబర్, 23:-
ఏలేశ్వరం మండలం ఐ సి డి ఎస్ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్తిపాడు ప్రాజెక్టు ఆధ్వర్యంలో యర్రవరం సెక్టార్ నందు 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు కు పలు అంశాలపై అవగాహన కల్పించారు.విద్యార్థినుల తండ్రులతో బైక్ లపై పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా సీడీపీఓ పద్మావతి మాట్లాడుతూ ప్రధానంగా స్థూలకాయ నివారణ చెక్కర మరియు నూనె వినియోగంపైఅవగాహనచేపట్టామన్నారు. బాల్య దశ సంరక్షణ శిశు,చిన్నపిల్లల ఆహారపు అలవాట్లపై అవగాహన,స్థానికనికి మద్దతు గ్రామీణ శక్తికి మార్గం పోషణకు బలమైన పునాది అని తల్లిదండ్రులకు సూచించామన్నారు.పోషణ,సంరక్షణలో పురుషుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ముఖ్యం అని తెలిపారు. చిన్నారులకు పోషక విలువలు గల ఆహారంతో పాటు వారి ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్ రవికుమార్ వర్మ,సిడిపిఓ పద్మావతి,గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు,టీడీపీ నాయకులు బసా ప్రసాద్,మైరాల కనకారావు,గంగిరెడ్ల మణికంఠ,ఆకుల నాని,పంచాయతీ కార్యదర్శి వర్మ,సెక్టార్ సూపర్వైజర్ జి చక్రవేణి,అంగన్వాడీ టీచర్స్ ఎస్ ఎల్ వి నాగమణి,పి.అనంత,ఎన్ అమ్మాజీ,పి చంద్రావతి,కె.బుజ్జమ్మ , హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు..
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird