ఏలేశ్వరం,వి.ర్.ఎం.న్యూస్, 24, ప్రతినిధి, ప్రిన్స్, సెప్టెంబర్, 23:-
పట్టణంలో జేవిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు.15 సంవత్సరాలగా పట్టణంలో లింగవరంకాలనీలో జువ్విన వీర్రాజు వీరరాఘవమ్మ,దంపతుల చేతులు మీదుగా ప్రజల సహకారంతో దేవి నవరాత్రి పూజల అత్యంత భక్తి శ్రద్ధలతో చేపడుతున్నారు.అమ్మవారి విగ్రహాని భక్తులు నడుమ గ్రామ పురవీధిలో ఊరేగింపు చేపట్టారు.అనంతరం మండపంలో వేద పండితులు ప్రత్యేక పూజలుతో అమ్మ వారి విగ్రహని ప్రతిష్ట జరిపి నవరాత్రి లో రోజుకు ఒక అలంకారంతో
తొమ్మిది రోజుల ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు.దుర్గా దేవి విగ్రహం ఊరేగింపు సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.ఈ సందర్భంగా జువ్విన వీర్రాజు, వీర రాఘవమ్మలు మాట్లాడుతూ, గత పదిహేను సంవత్సరాలుగా ఈ లింగవరం కాలనీలో గ్రామస్తులు సహకారంతో దుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు చేపడతామని అన్నారు ఇదే కాలనీ వాసులతో సాంస్కృతిక కార్యక్రమాలైనా కోలాటం భజన తదితర కార్యక్రమాలతో భక్తులను అలరించనున్నాయని తెలిపారు ప్రతిరోజు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని కావున భక్తులు వినియోగించుకోవాలని కోరారు.15 సంవత్సరాలుగా ఈ అమ్మవారికి పూజలు మా చేతుల మీదగా జరగడం మా పూర్వజన్మ సుకృతమని జేవియర్ ట్రస్ట్ సభ్యులు వీర్రాజు వీర రాఘవ దంపతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర పంచాయితీ కౌన్సిలర్ అలమండ సత్యవతి చలమయ్య,నాయకులు సామంతుల సూర్యకుమార్ వాగు బలరాం,బదిరెడ్డి వెంకన్న బాబు.సఖిరెడ్డి బుజ్జి,సామంతుల ఫణి పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird