

ప్రత్తిపాడు వి.ఆర్.ఎం. న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్
ఇటీవల విజయవాడలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మదర్ సర్వీసెస్ సొసైటీ వారి మూడవ వార్షికోత్సవ సందర్భంగా ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన 150 మందికి వివిధ రంగాల్లో జాతీయ పురస్కారాలు అందించగా, అందులో గత 25 సంవత్సరాలుగా గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు చేసిన ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవలను గుర్తించి సేవాంజలి మరియు ఏబిసిడి ప్రాజెక్టు ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి ఏబిసిడి ప్రసాద్ పాస్టర్ ని స్థానిక ప్రత్తిపాడు మండల మాస్టర్స్ ఫెలోషిప్ వారు కిత్తుమూరుపేటలో పాస్టర్ జయరాజు గారి మందిరములో జరిగిన సహవాస కూడికలో ఘనంగా సత్కరించారు.
సన్మాన గ్రహీత పాస్టర్ ఏబిసిడి ప్రసాద్ స్పందిస్తూ 1-1-2001 నుంచి ప్రారంభించిన సామాజిక మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమములను గుర్తించి సత్కరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయడానికి సహాయ సహకారాలు కావాలని కోరారు.
జిల్లా నాయకులు మాస ఇమ్మానియేలు సి హెచ్ అబ్రహం శామ్యూల్ రీజనల్ చైర్మన్ రెవ ఆర్ షాలేము రాజు, ఫెలోషిప్ అధ్యక్షులు జాన్ మాస సెక్రటరీ పులి బాబులు వైస్ ప్రెసిడెంట్ సుందర్ రావు తదితర సభ్యులు ఇందులో పాల్గొన్నారు END👆SIR
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird