

కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 24
మాజీ శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం మైనారిటీ అఫైర్స్ అడ్వైజర్, గౌరవనీయులు, పెద్దలు శ్రీ మహమ్మద్ షరీఫ్ ఇటీవల రాష్ట్ర నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన డాక్టర్ నాగూరు వీరభద్రుడు మంగళగిరి లోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దుస్శాలవా కప్పి ధన్యవాదాలు తెలియజేసు కున్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ పదవి ఇచ్చిన పార్టీకి సేవ చేస్తూ, కార్పొరేషన్ ద్వారా క్యాస్ట్ ను రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తయారు చేయవలసిందిగా సూచించారు. ఈ సందర్భంగా వీరభద్రుడు గారు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి డైరెక్టర్ పదవిని ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తూ, తమ వంటి పెద్దల ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా ఉండాలని షరీఫ్ కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగూరు వీరభద్రుడు గారి అనుచరులు స్టేట్ మైనార్టీ సెక్రటరీ షేక్ ఖాదర్బాషా, మాధవరం-1 టీడీపీ యువ నాయకులు పెగడ హరి ప్రసాద్, మామిళ్ళ మురళి రాయల్, మామిళ్ళ వెంకటేష్ రాయల్, బొగ్గడివారిపల్లి గ్రామ కమిటీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి లు పాల్గొన్నారు.